BREAKING
పర్యాటకంగా ఏపీని నంబర్-1 దిశగా నడిపిస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అవనిగడ్డ డిపో నుండి దసరా ప్రత్యేక బస్సులు కళ్యాణదుర్గంలో ఉచిత మెగా గుండె వైద్య శిబిరం. 110 వైద్య పరీక్షలు. రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలి గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పట్టిసీమ సరికొత్త ఊపిరి పోసింది. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు ఓటు చోరీకి పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి 108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం అహ్మదాబాద్‌లో 'బ్రిక్స్ సాంప్రదాయ క్రీడా సంబరాలు' కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ

అనర్హత కలిగిన సోదరుడికి పెన్షన్ ఇవ్వద్దు అంటూ ఫిర్యాదు

Select Suryaa Now
అనర్హత కలిగిన సోదరుడికి పెన్షన్ ఇవ్వద్దు అంటూ ఫిర్యాదు

పెంటపాడు, మేజర్ న్యూస్; అనర్హత కలిగిన వ్యక్తికి పెన్షన్ శాoక్షన్ చెయ్యవద్దని వచ్చిన ఫిర్యాదు పై విచారణ నిర్వహించిన పెంటపాడు ఎంపీడీవో సదరు దరఖాస్తుని తిరస్కరించినట్లు తెలియజేశారు. పెంటపాడు గ్రామానికి చెందిన పడాల సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉండి షాపింగ్ కాంప్లెక్స్ పై నెలకు లక్షల్లో ఆదాయం కలిగి ఉన్నాడని, ఏపీ 16 జి 4640 అనే లగ్జరీ కారు ఉందని, అతనికి కరెంటు మీటర్లు రీడింగ్ కూడా ఎక్కువగానే ఉందని వాటన్నిటిని దాచి తప్పుడు పద్ధతుల్లో పెన్షన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని అతని తమ్ముడు పడాల చిరంజీవి రెడ్డి ఆధారాలతో సహా పెంటపాడు ఎంపీడీవో కి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సదరు అధికారి పడాల సత్యనారాయణ రెడ్డి దరఖాస్తును తిరస్కరించినట్లుగా తెలియజేశారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా