BREAKING
భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ

Select Suryaa Now
అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ

దువ్వూరు, మేజర్ న్యూస్ : మండల కేంద్రమైన దువ్వూరులోని అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి  దసరా మహోత్సవాలను ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆర్యవైశ్య సభ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, కలశాల ఊరేగింపు, బిందె సేవ, సాంస్కృతిక ప్రదర్శనలు, అమ్మవారి గ్రామోత్సవాలను నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షులు అరవేటి సుబ్బారావు  తెలిపారు.శనివారంఅమ్మవారిశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాల కార్యక్రమాలను వివరించారు. ఉత్సవాల తొలిరోజైన ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 7 గణపతి పూజతో మొదలవుతుందన్నారు. రాత్రికి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారముతో  భక్తులకు దర్శనం ఇస్తానన్నారు. 12వ తేదీ సోమవారం రాత్రికి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము, 13వ తేదీ మంగళవారం రాత్రికి పార్వతీదేవి అలంకారం, 14వ తేదీ బుధవారము అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చుతారన్నారు. 15వ తేదీ గురువారము శ్రీ లలితాదేవి  ( తోట ఉత్సవం ) అలంకారముతో, 16వ తేదీ శుక్రవారం శ్రీ సరస్వతీ దేవి  ( బిందె సేవ ) అలంకారంతో భక్తులకు దర్శనం, 17వ తేదీ శనివారం శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంతో, 18వ తేదీ ఆదివారం శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( చండీ హోమం ) అలంకారంతో భక్తులకు దర్శనం ఇస్తారు అన్నారు. 19వ తేదీ సోమవారం శ్రీ మోహిని దేవి అలంకారంతో , 20వ తేదీ శ్రీ విజయలక్ష్మి దేవి అలంకారంతో దర్శనం ఇస్తారన్నారు, 20వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సినీ దర్శనం కాదు అని అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు తెలిపారు. 21వ తేదీ బుధవారం రాత్రి 8 గంటలకు పవళింపు సేవ అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు అని తెలిపారు. 21వ తేదీ ఉదయం 6 గంటలకు వసంతోత్సవం కలదు అని కావున ఆర్యవైశ్య సభ్యులందరూ హాజరుకావాలని సుబ్బారావు సూచించారు. కావున దసరా పండుగ రోజులలో ప్రతి ఒక్కరూ అమ్మవారి శాల దగ్గర ఉండి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని అధ్యక్షులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ విజయదశమి సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు శమీ దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు గ్రామోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో సన్నాయి వాద్యం,గొప్ప కళాకారుల డ్రమ్స్ ప్రదర్శన,కళాకారుల ఎస్ఈడీ మూవింగ్ తొట్టి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దొరసానిపల్లె శ్రీ హనుమాన్ భజన బృందం ఆధ్వర్యంలో చెక్కభజన నిర్వహించనున్నారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి వసంతోత్సవం  నిర్వహించనున్నారు. తప్పెట్ల బృందం ప్రదర్శనతో పురవీధుల్లో గ్రామోత్సవం సాగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆర్యవైశ్య సభ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గొల్లా పిన్ని లక్ష్మీ నరసింహమూర్తి , ఆర్యవైశ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.