BREAKING
భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం

Select Suryaa Now
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం

బృందావన కాలనీలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. శనివారం బృందావనం కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాలనీలో తొమ్మిది రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి హ్యామ్ పథకం కింద రూ.21 కోట్ల నిధులు లభించాయని తెలిపారు. వీటితో రోడ్లు, కాలువలతో పాటు మున్సిపల్ భవనానికి రూ.3 కోట్లు, పార్కు అభివృద్ధికి రూ.2.5 కోట్లు, టిడ్కో ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఎంవీ నగర్, వీవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని చెప్పారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార రాజకీయాలకు తావివ్వకుండా అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అభివృద్ధినే ప్రజల ముందుంచి ఓట్లు కోరుతామని, గత ఐదేళ్లలో చేయలేని పనులను ఇప్పుడు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. మాజీ కౌన్సిలర్ హుస్సేన్ భాష తదితరులు ఉన్నారు.