సుప్రీం కోర్టు మార్గ దర్శకాలకు అనుగుణంగానే..
రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారుపై ఆయన కీలక విషయాలను వెల్లడించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు కోసం ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని పాటిస్తున్నామని, ఇందులో బీసీ రిజర్వేషన్ల ఖరారులో రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఎంతో కీలకం కానుందని తెలిపారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా ముందుగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని, ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే బీసీ కోటా లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. యూనిట్ ప్రాతిపదికన రిజర్వేషన్లను లెక్కిస్తామని వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేవలం ప్రభుత్వపరంగానే కాకుండా పార్టీ పరంగానూ బీసీలకు అదనపు అవకాశాలు కల్పిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.