BREAKING
11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు

​స్వచ్ఛ నగరమే లక్ష్యంగా.. చీపురుపట్టిన ఎమ్మెల్యే లోకం మాధవి

Select Suryaa Now
​స్వచ్ఛ నగరమే లక్ష్యంగా..  చీపురుపట్టిన   ఎమ్మెల్యే లోకం మాధవి

​నెల్లిమర్ల, సూర్య : 'స్వచ్ఛమైన నెల్లిమర్ల' లక్ష్యంగా, 'స్వచ్ఛంద స్వర్ణాంధ్ర' ధ్యేయంతో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు జోరుగా సాగాయి. సోమవారం జరజాపేట బీసీ కాలనీల్లో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్వయంగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
​ కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, స్వయంగా పారిశుధ్య కార్మికులతో కలిసి ఆమె రోడ్లపై చీపురుపట్టి పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
​ పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన జీవనానికి బలమైన పునాదులని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కేవలం ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు సమష్టిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
​పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి పౌర బాధ్యత అని ఆమె గుర్తుచేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రవ్వా నాని, అప్పికొండ రవికుమార్, జనా ప్రసాద్, గంటా సతీష్, వాసు, అవనాపు మురళి తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.