BREAKING
11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు

గెలుపే లక్ష్యంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Select Suryaa Now
గెలుపే లక్ష్యంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి :రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో నిర్వహించిన సమావేశంలో కీలక దిశానిర్దేశం చేశారు. నవంబర్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిగా ముగించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో రెగ్యులర్ పాలనపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత పూర్తిగా జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం స్థానాలను కైవసం చేసుకునేలా అందరూ సమష్టిగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నాహాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు.