BREAKING
11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి నేటి నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రులు

ఆయుర్వేదానికి దీవి గోపాలాచార్యులు సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
ఆయుర్వేదానికి దీవి గోపాలాచార్యులు సేవలు చిరస్మరణీయం

ఆయుర్వేదానికి  దీవి గోపాలాచార్యుల సేవలు చిరస్మరణీయం

-ఘనంగా 135వ జయంతి వేడుకలు అవనిగడ్డ మేజర్ న్యూస్ దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యాభివృద్ధికి దీవి గోపాలాచార్యులు చేసిన సేవలు చిరస్మరణీయమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శనివారం దీవి గోపాలాచార్యుల 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి వెంకట్రామ్‌తో పాటు దీవి వంశీయులు గోపాలాచార్యుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ వైద్య పరిశోధకుడిగా, ఆయుర్వేద పండితుడిగా దీవి గోపాలాచార్యులు విశేష ఖ్యాతి గడించారని తెలిపారు. 1917లో అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి అధ్యక్షత వహించి ఆయుర్వేద అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా వైద్యరత్న, ఆయుర్వేద మార్తాండ, భిషగ్మణి వంటి బిరుదులు అందుకున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రచారం చేసి, దాని విస్తృతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అంతటి ఖ్యాతి గడించిన మహనీయుడు దివిసీమకు చెందినవారు కావడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు.

గోపాలాచార్యుల సేవలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత ఏడాది ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో దీవి వంశీయులు దీవి రామకృష్ణమాచార్యులు, దీవి వేంకటేశ్వరకుమార్, దీవి సత్యప్రసాద్, పీఏసీఎస్‌ చైర్మన్లు ముమ్మారెడ్డి శ్రీనివాసరావు, తోట శ్రీనివాసరావు, కూటమి నాయకులు బండ్రెడ్డి హరి, భోగాది శివవిష్ణు, నీటి సంఘం అధ్యక్షుడు బండ్రెడ్డి నీలాంబరరావు, కూనపరెడ్డి నాగమల్లేశ్వరరావు, మాదివాడ అర్జునరావు, జనసైనికులు పాల్గొన్నారు. అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా