పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల ఆర్టీసీ బస్సులు రద్దు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
పోలవరం జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ, రాకోట, చెలకవీధి గ్రామాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకవాడ గండికి గోకవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం.అజయ్ బాబు శనివారం విలేకరులకు తెలిపారు. ఈ కారణంగా ఆదివారం కొన్ని సాధారణ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, వారి ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.