కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి
పులివెందుల మేజర్ న్యూస్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అప్రజాస్మిక నిర్ణయాల పైన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం పులివెందుల అంబేద్కర్ సర్కిల్లో సిపిఐ కాంగ్రెస్ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి చంద్రశేఖర్, సిపిఐ పులివెందుల ఏరియా కార్యదర్శి బి వెంకట రాములు, కాంగ్రెస్ పార్టీ పులివెందుల అధ్యక్షుడు బి ఖాదర్,లు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు ఇస్తూ నిరసన తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగించడమే లక్ష్యంగా చేసుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని దురాశ అధికారకాంక్షతో ఎస్ ఐ ఆర్ పేరుతో దాదాపు దేశంలో 13 కోట్ల ఓటర్లను అప్రజాస్వామకంగా తొలగించి నిరంకుశ పాలనకు తెరలేపిందన్నారు సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేస్తున్న వారి నిర్ణయాలను పక్కనపెట్టి మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా జెన్ జి ఒకవైపు అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే వారి నిరసనను అడ్డుకునేందుకు అక్రమ అరెస్టులు నిర్బంధాలకు పూనుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు అమలు విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే కేసులు ఉపా చట్టాలతో జవాబు ఇస్తున్న మోడీ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు బతికున్న వారి ఓట్లను తొలగించి ఎలక్షన్ కమిషన్ పారదర్శకత దెబ్బతినే విధంగా ప్రవర్తించిన జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శ్రీకారం చుడుతామని తెలియజేశారు ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్ అడ్డగోలుగా ఓట్లను రద్దు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండాలని అర్హుడైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికార దాహంతో తహతహలాడుతున్న బిజెపి తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మాత్రమే ఓటు చోరీకి పాల్పడుతుందని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తుందని అన్నారు ఇప్పటికైనా ప్రజాస్వాత్మీయ హక్కులను కాపాడి వాటికి విలువనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించకపోతే ఈ దేశంలోని యువత మేధావులందరినీ ఏకం చేసి బిజెపి ప్రభుత్వ పథనానికి నాంది పలుకుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పులివెందుల పట్టణ నాయకులు సుభాన్, రూప కాంత్, నరేంద్ర, సిపిఐ వేముల మండల కార్యదర్శి చాంద్ భాష, రాజమోహన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రాజా ,వైస్ ప్రెసిడెంట్ చంద్రబాబు, అనూష, బాబు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు