BREAKING
కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు. ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ దశాబ్దం తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ ఖాన్.. డిసెంబర్‌లో సినిమా విడుదల! ఓటీటీ రిలీజ్ కోసం నాని సినిమా రీ-ఎడిట్?.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! మెక్సికో తీరం వెంబడి దూసుకొస్తున్న 'సైమన్' తుఫాను అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి ఎల్‌నినో పరిస్థితులపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం

సీఈసి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి:- వామపక్షాల డిమాండ్

Select Suryaa Now
సీఈసి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి:-  వామపక్షాల డిమాండ్

సూర్య, నంద్యాల బ్యూరో::కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం వచ్చేలాగున ఈసీ ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన సిఇసి జ్ఞానేశ్ కుమార్ ని వెంటనే తొలగించాలని సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సిఇసి జ్ఞానేశ్ కుమార్ గారి శవయాత్ర  సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మీదుగా సాయిబాబా నగర్ వరకు పూలు బొరుగులు, చల్లుతూ  ప్రదర్శన చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు కే మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్,సీనియర్ నాయకులు తోట మద్దులు, citu పట్టణ కార్యదర్శి వెంకట లింగం,జిల్లా కార్యదర్శి వెన్న బాలవెంకట్, లక్ష్మణ్,ప్రజా సంఘాల జిల్లా నాయకులు ఎమ్మార్ నాయక్, సురేష్, శ్రీనివాస రెడ్డి,రత్నమయ్య, చెరుకు కృష్ణ, వీరసేన, బాలహుస్సేని వీరితోపాటు మరికొంతమంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్ లు   మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని,ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని,ఓటర్ల జాబితా నుండి అన్యాయంగా తొలగించిన వారందరికీ ఓటు హక్కును పునరుద్దరించాలని,ఈసీఐ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని,ప్రజాతంత్ర పద్దతిలో స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని ముఖ్యంగా ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన కథనం యావత్ భారతదేశాన్ని కుదిపేసిందని ముఖ్యంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల 80 లక్షలకు పైగా ఓటర్లను తొలగించడం అంటే సామాన్య విషయం కాదని దీంట్లో బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తూ బిజెపికి వ్యతిరేకమైన ఓట్లను ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్,అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీల కు చెందిన కార్యకర్తల ఓట్లను తొలగించడంలో ప్రధాన పాత్ర సిఇసి జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వివరించడం వలన జరిగిందని, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో బిజెపికి సహకరించి అధికారంలోకి వచ్చేందుకు అనేక కుట్రలను సిఇసి జ్ఞానేశ్ కుమార్ పడి ఏకపక్ష నిర్ణయాలతో బిజెపికి అధికారం రావడం కోసం కృషి చేయడం జరిగిందని, వెంటనే సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించి ప్రజాస్వామ్య బద్దంగా తొలగించిన ఓటర్లందరినీ యధావిధిగా కొనసాగించాలని ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈసీ లో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించి, కఠిన చర్యలు తీసుకునేంతవరకు దేశవ్యాప్త ఉద్యమానికి ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు, జెన్ జి లు శ్రీకారం చుట్టాయని అన్నారు. ఈరోజు విద్యార్థి యువజన సంఘాల కామా కాక్రోచ్ జనతా పార్టీల ఆధ్వర్యంలో చేపట్టే శాంతితా ప్రదర్శనకు బిజెపి ప్రభుత్వం వణికిపోయి ఎక్కడికి ఎక్కడ దేశవ్యాప్తంగా ఉన్న జెన్ జి లను అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని,  రాబోయే కాలంలో ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చనిందని బిజెపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*