BREAKING
పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్‌ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం గల్ఫ్‌లో విదేశీ సైనిక బలగాలపై ఇరాన్ హెచ్చరిక.. నౌకా దళం విస్తరణకు దక్షిణ కొరియా సన్నాహాలు: తుర్కియే కీలక ఆమోదం.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో సంయుక్త రక్షణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం: మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు

పేదలకు జీవనోపాధి కల్పించడమే పీ4 లక్ష్యం

Select Suryaa Now
పేదలకు జీవనోపాధి కల్పించడమే పీ4 లక్ష్యం

పెనమలూరు, మేజర్ న్యూస్: పీ4 కార్యక్రమం ద్వారా సామాజిక సేవలో భాగస్వాములై పేదలకు జీవనోపాధి కల్పించడం అభినందనీయమని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. సోనోవిజన్ సంస్థకు చెందిన జనార్ధన్ మూర్తి సహకారంతో పీ4 కార్యక్రమంలో భాగంగా యనమలకుదురు ప్రాంతానికి చెందిన షర్మిలకు వ్యాపారం చేసుకునేందుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా తోపుడు బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోనోవిజన్ జనార్ధన్ మూర్తి రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు, నిరుపేదలకు అండగా నిలవడం ప్రశంసనీయమన్నారు. ప్రతి నెలా పీ4 కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన ముందుకు రావడం ఆదర్శనీయమని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదలకు ఉపయోగపడేలా జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. జనార్ధన్ మూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి నెలా పీ4 కార్యక్రమంలో భాగంగా పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్‌రావు, పెనమలూరు మండల టీడీపీ అధ్యక్షుడు కోయా ఆనంద్, యనమలకుదురు టీడీపీ నాయకులు అశోక్ చక్రవర్తి, సుంకర చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.


 

✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.