BREAKING
కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు. ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ దశాబ్దం తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ ఖాన్.. డిసెంబర్‌లో సినిమా విడుదల! ఓటీటీ రిలీజ్ కోసం నాని సినిమా రీ-ఎడిట్?.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! మెక్సికో తీరం వెంబడి దూసుకొస్తున్న 'సైమన్' తుఫాను అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి ఎల్‌నినో పరిస్థితులపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం

ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు చేపడుతున్న 'విమెన్ డ్రాప్ ఎట్ హోమ్' సేవలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మరోసారి చాటుకున్నాయి.

Select Suryaa Now
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్  ఆదేశాల మేరకు, జిల్లాలో మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు చేపడుతున్న 'విమెన్ డ్రాప్ ఎట్ హోమ్' సేవలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మరోసారి చాటుకున్నాయి.

ఏలూరు సూర్య న్యూస్ పెదపాడు మండలం కొత్తముప్పర్రు గ్రామానికి చెందిన కోట ఉమా శబరి (25) చెన్నైలో మెడికల్ కోడింగ్ ఉద్యోగం చేస్తున్నారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె స్వగ్రామానికి రాగా, తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ  ఆమె ఒంటరిగా వెళ్ళుటకు తన ఇంటికి ఆమె సహాయం కోసం ఏలూరు పోలీసు కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించారు.వెంటనే స్పందించిన కంట్రోల్ రూమ్ సిబ్బంది:యువతి కాల్‌కు క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన కంట్రోల్ రూమ్ సిబ్బంది, మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వెంటనే ‘డ్రాప్ ఎట్ హోమ్’ వాహనాన్ని రంగంలోకి దించారు. ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ సిబ్బంది కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మరియు మహిళా ఎస్ఐ  నిర్దేశలా మేరకు ఆమెను సురక్షితంగా కొత్తముప్పర్రులోని ఆమె స్వగృహానికి చేరవేశారు.తెల్లవారుజామున అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి, తమ ప్రాంగణానికి రక్షిత వాతావరణం కల్పించిన ఏలూరు పోలీసుల సేవలను ఉమా శబరితో పాటు స్థానికులు కొనియాడారు.ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మహిళల భద్రతకు మేమున్నాం” అనే భరోసానిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ సిబ్బంది పనితీరు అభినందనీయం.

 

 జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు