andhrapradesh
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి
పెనమలూరు, మేజర్ న్యూస్: డబుల్ ఇంజిన్ సరతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ కూటమిని ముందుకు తీసుకువెళ్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. పోరంకిలో బీజేపీ నూతన జెండా దిమ్మను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్‌రావును ఆత్మీయంగా పలకరించి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల సహకారంతో స్థానికంగానూ అభివృద్ధి వేగవంతం కావాలంటే కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ రోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, భా
✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.