BREAKING
అర్హులైన ఒక్కరూ ఓటరు నమోదు కోవాలి . ఆర్డీవో వసంత బాబు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి ఎం ఎల్ సీ ఎన్నికల్లో విజయానికి పక్కా వ్యూహం భారత ఐటీ కంపెనీలపై అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టిన భారత్. ప్రొఫెసర్ బిమోల్ అకోయిజమ్‌ను విధుల నుంచి తొలగించిన జేఎన్‌యూ! 28వ డివిజన్ భానునగర్‌లో పలువురు టీడీపీలో చేరిక యూపీ నుంచి 10 మంది రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక అనంతపురంలో యూజేఏసీ, వామపక్షాల, వైస్సార్సీపీ , కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ* *ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి..* *ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి – బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి* జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే గడ్డకట్టే చలిలో బైకర్‌కు అల్పాహారం అందించిన ఆర్మీ అధికారి.. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు తయారు చేస్తూ నెలకు రూ.60,000 సంపాదన.. పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలోనికి గంగరాజుకు చోటు. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి*

రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ధ్వజం: రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారంటూ మండిపాటు!

Select Suryaa Now
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ధ్వజం: రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారంటూ మండిపాటు!

న్యూఢిల్లీ :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ దేశంలోని అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వాటి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం కాంగ్రెస్ పార్టీకి మొదటినుంచీ అలవాటు లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేక, విదేశీ వేదికలపై సైతం భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చేలా రాహుల్ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టారు. స్వదేశంలోనూ, విదేశాల్లోనూ దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను మానుకుని, ఇప్పటికైనా ప్రజాతీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలని కేంద్ర మంత్రి ఘాటుగా హితవు పలికారు.