అంకిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
రూ.42 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం
కీసర డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి శంకుస్థాపన
కీసర, మేజర్ న్యూస్,(అక్టోబర్ 09):
కీసర డివిజన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో రూ.42 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కీసర డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు కిలోమీటరు మేర చేపట్టనున్న ఈ పనులతో స్థానికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కీసర డివిజన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను తీసుకువస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తటాకం లక్ష్మణ్ శర్మ, ఆర్. పవన్, మాజీ ఎంపీటీసీలు బేలిదే రమేష్ గుప్తా, మచ్చాని జంగయ్య యాదవ్, అంకిరెడ్డిపల్లి నాయకులు కోల్కురి మహేష్, సింగారం నారాయణ, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.