BREAKING
చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ: సీఎం విజయ్‌తో భేటీ, నేడు విద్యార్థులతో ముఖాముఖి అర్హులైన ఒక్కరూ ఓటరు నమోదు కోవాలి . ఆర్డీవో వసంత బాబు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి ఎం ఎల్ సీ ఎన్నికల్లో విజయానికి పక్కా వ్యూహం భారత ఐటీ కంపెనీలపై అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టిన భారత్. ప్రొఫెసర్ బిమోల్ అకోయిజమ్‌ను విధుల నుంచి తొలగించిన జేఎన్‌యూ! 28వ డివిజన్ భానునగర్‌లో పలువురు టీడీపీలో చేరిక యూపీ నుంచి 10 మంది రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక అనంతపురంలో యూజేఏసీ, వామపక్షాల, వైస్సార్సీపీ , కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ* *ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి..* *ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి – బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి* జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే గడ్డకట్టే చలిలో బైకర్‌కు అల్పాహారం అందించిన ఆర్మీ అధికారి.. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు తయారు చేస్తూ నెలకు రూ.60,000 సంపాదన.. పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలోనికి గంగరాజుకు చోటు.

సాహితీ దిగ్గజం ముదిగొండ శివప్రసాద్‌ మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం!

Select Suryaa Now
సాహితీ దిగ్గజం ముదిగొండ శివప్రసాద్‌ మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం!

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌ పరమపదించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. నవలా రచయితగా, చరిత్ర పరిశోధకుడిగా, విమర్శకుడిగా మరియు వ్యాసకర్తగా సాహిత్య రంగానికి ఆచార్య శివప్రసాద్‌ అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు.

మన దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై సమాజంలో, ముఖ్యంగా తెలుగు పాఠకులలో విశేష ఆసక్తిని పెంపొందించడంలో ఆయన కృషి మరువలేనిదని సీఎం గుర్తు చేసుకున్నారు. ముదిగొండ శివప్రసాద్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు సాహితీ లోకానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.