చీకట్లోనే బతుకమ్మ సంబరాలా?
121, 122, 123 డివిజన్లలో వీధి దీపాలు వెలగడం లేదని ఏసిఎఫ్ ఆందోళన
రాజేంద్రనగర్ సర్కిల్ 121, 122, 123 డివిజన్ల పరిధిలో పలు కాలనీల్లో వీధిదీపాలు పనిచేయక రోడ్లు చీకటిమయంగా మారాయని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ (ఏసీఎఫ్) బృందం ఆందోళన వ్యక్తం చేసింది. బతుకమ్మ వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో మహిళలు సాయంత్రం వేళల్లో చీకట్లోనే సంబరాలు జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంది.
ఏసీఎఫ్ అధ్యక్షుడు వినయ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, విజయ్ పద్మనాభం, పీ అండ్ టీ కాలనీకి చెందిన అబ్దుల్ హఫీజ్ పలు కాలనీల్లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. బతుకమ్మ కుంటలు, చెరువుల వద్ద కూడా తగిన వెలుతురు, పారిశుద్ధ్య ఏర్పాట్లు కల్పించాలని కోరారు. పనిచేయని వీధిదీపాలకు వెంటనే మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట కొత్త దీపాలు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఏసీఎఫ్ బృందం డిమాండ్ చేసింది.
గండిపేట్ మేజర్ న్యూస్ (అక్టోబర్ 10)