BREAKING
ఎమ్మెల్యే బొలిశెట్టి కి అభినందనలు తెలిపిన తెలుగుదేశం నాయకులు తిరుమల శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం నిత్యాన్నదాన పథకానికి విరాళాలు 400 కోట్ల క్లబ్‌లో 'దృశ్యం 3'.. అజయ్ దేవగన్ ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్! ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు చేపడుతున్న 'విమెన్ డ్రాప్ ఎట్ హోమ్' సేవలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మరోసారి చాటుకున్నాయి. సీఈసి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి:- వామపక్షాల డిమాండ్ 'భాషా 2', 'పేట్టా 2' కాదు అన్న రజినీకాంత్.. నెల్సన్‌తో 'జైలర్ 2' చేయడానికి కారణమిదే! కొత్త యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. గురువుగా మారి సరికొత్త పాఠాలు! శెట్టూరు లో వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశం. ఎస్ఐర్ పేరుతో కోట్లాది ఓట్ల తొలగింపు..జ్ఞానేశ్వర్ చిత్రపటాలను దగ్ధం కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించిన మంత్రి తుమ్మల పేదలకు జీవనోపాధి కల్పించడమే పీ4 లక్ష్యం చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ: సీఎం విజయ్‌తో భేటీ, నేడు విద్యార్థులతో ముఖాముఖి అర్హులైన ఒక్కరూ ఓటరు నమోదు కోవాలి . ఆర్డీవో వసంత బాబు.

విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ

Select Suryaa Now
విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ
సూర్య కరీంనగర్:అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి నేతృత్వంలో, విజయవాడ శ్రీ కనకదుర్గ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు జి.వి. నాగేశ్వరరావు,శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి చేనేత వస్త్రాల సమర్పణ శని వారం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం సారథ్యంలో 10 రోజులకు గాను 10 చేతులతో నేసిన పట్టు చీరలను అమ్మవారికి సమర్పించారు. చేనేత కళాకారుల చేతి నైపుణ్యంతో తయారైన ఈ చీరలను ఆలయ అర్చకులు అమ్మవారికి అలంకరించనున్నట్లు మెతుకు సత్యం తెలిపారు.చేనేత వస్త్రాలకు పుట్టినిల్లు పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సాంప్రదాయాన్ని చాలా సంవత్సరాలుగా పూర్వీకుల నుండి కొనసాగిస్తున్నామని మెతుకు సత్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, దుష్యంతల, బొళ్ల శివశంకర్, రాపోలు సుధాకర్, బొద్దుల లక్ష్మణ్, గుర్రం శ్రావణ్ కుమార్, గుంటక రూప, మెతుకు మంజుల రాణి, పోరండ్ల శారద, నోముల రేఖ, చిన్నకోట్ల స్వప్న, గుర్రం విశ్వేశ్వర్ రావు, కర్నాటి విజయ్, కైరంకొండ ఉదయ్, మెతుకు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.