కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి తైలాభిషేకం, అన్నాభిషేకం
అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు
కీసర,మేజర్ న్యూస్, (అక్టోబర్ 10):
ప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం పూజా కార్యక్రమాలు కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా తైలాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు.ఆలయ అర్చకులు రవికాంత్ శర్మ, వెంకటేష్ శర్మ, వీరేశం శర్మ, భరత్ తదితరులు వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు సమర్పించారు. అమావాస్య కావడంతో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కీసరగుట్ట పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.
రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.