రఫీ వైద్యానికి మంత్రి గొట్టిపాటి భరోసా.. రూ.1.73 లక్షల LOC మంజూరు.
సూర్య అద్దంకి.
అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ వైద్య చికిత్సకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిఫారసుతో CMRF నుంచి రూ.1,73,037 విలువైన LOC మంజూరైంది. KIMS, ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయనకు ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఈ సాయం అందింది. మంజూరైన LOC పత్రాన్ని నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ కరిముల్లా అందజేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.