ఎన్నికల నేపథ్యంలో.. రేణిగుంటలో పోలింగ్ కేంద్రాల తనిఖీ
ఎన్నికల నేపథ్యంలో.. రేణిగుంటలో పోలింగ్ కేంద్రాల తనిఖీ
రేణిగుంట మేజర్ న్యూస్: రాబోయే స్తానిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రేణిగుంట , డీఎస్పీ, శ్రీనివాస్ రావు, సీఐ జయచంద్ర మండల తహసీల్దార్, శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ రవిచంద్ర సంయుక్తంగా రేణిగుంట పరిధిలోని ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ తనిఖీల ద్వారా చర్యలు చేపట్టారు.
రిపోర్టర్: రమేష్ బాబు కొండల