టీఎస్‌ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు ప్రారంభం
టీఎస్‌ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు ప్రారంభం
బీహెచ్‌ఈఎల్ డిపోలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు
బీహెచ్‌ఈఎల్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో యూనియన్ ఎన్నికల పోలింగ్ బీహెచ్‌ఈఎల్ డిపోలో నేడు ఉదయం 5 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే ఉద్యోగులు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరి ఓటు వేస్తుండటంతో ఎన్నికల సందడి నెలకొంది.ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. పోలీసు సిబ్బంది, సంబంధిత అధికారులు పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారంలో యూనియన్ల పాత్ర కీలకంగా ఉండటంతో ఈ ఎన్నికలపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఇదే విధంగా ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.