శారద విద్యానికేతన్‌లో వైభవంగా ముందస్తు దసరా వేడుకలు
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: స్థానిక శారద విద్యానికేతన్ పాఠశాలలో దసరా పండుగను పురస్కరించుకుని ముందస్తు దసరా నవరాత్రి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు ధరించిన వివిధ రకాల పౌరాణిక, ఆధ్యాత్మిక వేషధారణలు ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఐదో తరగతి విద్యార్థిని కె. మనస్విని ధరించిన "అష్టలక్ష్మి" వేషధారణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అష్టలక్ష్ముల రూపాలను ప్రతిబింబిస్తూ అమ్మవారి దివ్య రూపంలో అలరించిన మనస్విని అభినయాన్ని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.మన సంస్కృతీ సాంప్రదాయాలు, పండుగల విశిష్టతను పిల్లలకు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది. అష్టలక్ష్మి వేషధారణలో అలరించిన కె. మనస్వినితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరినీ పాఠశాల కరస్పాండెంట్ కే. జల ప్రతాప్, కే. కాత్యాయని, ఉపాధ్యాయ బృందం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం