BREAKING
బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై స్పందించిన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఏమన్నారంటే? మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అశోక్ సార్ కుందుర్పి లో విద్య కింద విద్యార్థులకు600 సైకిళ్ల పంపిణి. నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు దర్శి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం.. అసలేం జరిగింది? నేడు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విసృత స్థాయి సమావేశం నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. కొత్త మీట్ రికార్డు సృష్టించిన కుల్దీప్, అదరగొట్టిన అథ్లెట్లు అముదాలపల్లి పంచాయితీలో పల్లె పండుగ 3.0కు మంత్రి అనగాని శ్రీకారం వేంసూరులో భారీ పేలుడు పదార్థాలు పట్టివేత... ఉచిత పశు సంతానోత్పత్తి వైద్య శిబిరం.. మీ సేవ- ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన సేవలను వెంటనే పునరుద్దరించాలి- మంత్రి ఫరూక్ కు వినతి నిర్మాతగా నాని మరో సినిమా.. నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దుమ్ము ధూళితో నరకయాతన...

Select Suryaa Now
దుమ్ము ధూళితో నరకయాతన...

దుమ్ము ధూళితో నరకయాతన....

ఆగిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి...

పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల నిరసన..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గత 9 నెలలుగా ఆగిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు ప్రధాన సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధాంతరంగా రోడ్డు పనులు నిలిపివేయడంతో వాహనాలు వెళుతుంటే దుమ్ము ధూళి లేచి ఇళ్లల్లోకి దుకాణంలోకి వస్తుందని, దీంతో శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని, గుంతల కారణంగా వృద్ధులు చిన్నారులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారని, వాహనాలు వెళ్లే క్రమంలో రాళ్లు లేచి పాదాచారులకు తగులుతూ ప్రమాదాలు గురవుతున్నారని, ఈ విషయంపై కాంట్రాక్టర్లను అధికారులకు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదు అని గ్రామస్తులు మండిపడ్డారు. ఆగిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, రోడ్లపై నీళ్లు చల్లి దుమ్ము ధూళిని నివారించాలని నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ విజయసింహారెడ్డి వచ్చి సమస్యను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, రేపటినుండి నీళ్లు చల్లిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మారగాని అశోక్, వార్డు సభ్యులు, వ్యాపార యజమానులు, ఆటో యూనియన్ సభ్యులు, గ్రామ యూత్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు