BREAKING
బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై స్పందించిన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఏమన్నారంటే? మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అశోక్ సార్ కుందుర్పి లో విద్య కింద విద్యార్థులకు600 సైకిళ్ల పంపిణి. నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు దర్శి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం.. అసలేం జరిగింది? నేడు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విసృత స్థాయి సమావేశం నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. కొత్త మీట్ రికార్డు సృష్టించిన కుల్దీప్, అదరగొట్టిన అథ్లెట్లు అముదాలపల్లి పంచాయితీలో పల్లె పండుగ 3.0కు మంత్రి అనగాని శ్రీకారం వేంసూరులో భారీ పేలుడు పదార్థాలు పట్టివేత... ఉచిత పశు సంతానోత్పత్తి వైద్య శిబిరం.. మీ సేవ- ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన సేవలను వెంటనే పునరుద్దరించాలి- మంత్రి ఫరూక్ కు వినతి నిర్మాతగా నాని మరో సినిమా.. నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త డంపింగ్‌!

Select Suryaa Now
శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త డంపింగ్‌!

రోడ్డుపైనే చెత్త కుప్పలు.. పందుల స్వైరవిహారం

దుర్వాసన, దోమలతో స్థానికుల అవస్థలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

శంషాబాద్‌ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డుపైనే చెత్తను పడేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. చెత్త కుప్పల వద్ద పందులు స్వైరవిహారం చేస్తుండగా, దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయం పక్కనే ఈ పరిస్థితి నెలకొనడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రివేళ చెత్త దహనం.. పొగతో ఇబ్బందులు

చెత్తను రాత్రి వేళల్లో కాల్చుతుండటంతో పొగ, దుర్వాసన పరిసర ప్రాంతాలను కమ్మేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. చెత్త పేరుకుపోవడంతో దోమల బెడద పెరుగుతోందని, పారిశుద్ధ్యం పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రోడ్డుపై కార్లు, ఆటోలను పార్కింగ్‌ చేసి వదిలేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు.

అధికారులు స్పందించేదెప్పుడు?

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగించడంతోపాటు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాత్రివేళ చెత్తను కాల్చకుండా అడ్డుకోవాలని, రోడ్డును ఆక్రమిస్తూ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్న వారిపై కూడా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

– పోతుల నర్సింహా, మేజర్‌ న్యూస్‌ - శంషాబాద్‌.