మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి: మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ అధికారులు శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మెడికల్ కళాశాల విద్యార్థి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పురోగతి, విద్యార్థుల సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.జగిత్యాల మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ శాఖ అధికారులు తెలిపారు.