BREAKING
నేడు దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు ఫిఫా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్పెయిన్ దూకుడు అద్దంకిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు. నెట్‌ఫ్లిక్స్‌లో పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ మూవీ రివ్యూ.. కథ బాగున్నా థ్రిల్ మిస్ అయిందా? మానసిక ఆరోగ్యంపై రాజమహేంద్రవరం జీఎంసీలో అవగాహన సదస్సు, ర్యాలీ ప్రజాసేవ నుంచి పంచాయతీ పీఠం దిశగా ఏలూరి మాధవరావు బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం!

బతుకమ్మ ఏర్పాట్లపై భగ్గుమన్న బీఆర్ఎస్…..

Select Suryaa Now
బతుకమ్మ ఏర్పాట్లపై భగ్గుమన్న బీఆర్ఎస్…..

సూర్య కరీంనగర్: బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు శుక్రవారం కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడికి యత్నించాయి. బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి, నగరపాలక సంస్థ అధికారులకు, పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు కిందపడి గాయాలపాలయ్యారు. అనంతరం పోలీసులు బీఆర్‌ఎస్‌ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీకి తరలించారు.

పండుగల నిర్వహణలో నిర్లక్ష్యమెందుకు?

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ, దసరా, ఉగాది తదితర పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసేదని పేర్కొన్నారు. పండుగలకు నెల రోజుల ముందే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆడపడుచులు సంతోషంగా వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకునేవారని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగల నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.

ముందస్తు ప్రణాళిక ఏదీ?

జనవరిలోనే విడుదలయ్యే క్యాలెండర్‌లో బతుకమ్మ, దసరా, రంజాన్‌, ఇతర పండుగల తేదీలు స్పష్టంగా ఉంటాయని, అలాంటప్పుడు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పండుగ సమీపించిన తర్వాత టెండర్లు నిర్వహించడం వల్ల ఏర్పాట్లలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యే సమయానికి కూడా అవసరమైన ఏర్పాట్లు పూర్తి కాకపోవడం నగరపాలక సంస్థ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.

చీకట్లో బతుకమ్మ ఆడాలా?

తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు నగరంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని వీధి దీపాలు సరిగా వెలగకపోతే మహిళలు చీకట్లోనే బతుకమ్మ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో పనిచేయని వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేసి, అవసరమైన చోట కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

హిందువుల పండుగల నిర్వహణలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించిన నేతలు.. బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పండుగల నిర్వహణలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

కలెక్టర్‌ చొరవ తీసుకోవాలి

కరీంనగర్‌ నగరపాలక సంస్థ అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపి మూడు రోజుల్లోగా పండుగ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు డిమాండ్‌ చేశాయి. వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పండుగ నిర్వహణకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే సిద్ధం చేయాలని కోరాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ, దసరా పండుగలను ఆనందంగా జరుపుకునేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశాయి.

పండుగ ఏర్పాట్లలో నిర్లక్ష్యం కొనసాగితే ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు. ప్రజల పండుగలను రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు నగరపాలక సంస్థపై ఉందని పేర్కొన్నారు…..
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ , మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ , కార్పొరేటర్ లు గుగ్గిళ్ల జయశ్రీ , జమ్మూ , యూసుఫ్, నలువాల రవీందర్ , గాదె రూపా శ్రీనివాస్ , ప్రదీప్ యాదవ్ , మాజీ కార్పొరేటర్ లు గందె మాదవీ మహేష్, జంగిలి ఇలెండర్ యాదవ్ , ఎడ్ల సరిత అశోక్ , సోనూ సింగ్, కర్ర సూర్య శేఖర్ , గంటల రేణుక , తదితరులు పాల్గొన్నారు