BREAKING
అరకు పార్లమెంట్ జనసేన నిర్వహణ దళ్ సభ్యుడిగా డొంపాక సాయికుమార్ నియామకం 17న అనంతలో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ ప్రారంభం.. మచ్చ రామలింగారెడ్డి పులివెందుల అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యం బీటెక్ రవి కొడకంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల చేయూత అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే .. నేటి నుండి పాలకొండ లో దసరా ఉత్సవాలు సదాశివపేట పట్టణం లోని సిద్దాపూర్ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలి: జగ్గారెడ్డి, నిర్మల* రాహుల్ గాంధీ కి మద్దతుగా సంగారెడ్డి లో జగ్గారెడ్డి ‘సేవ్ అవర్ ఓట్స్’ అనే వినూత్న కార్యక్రమం..* కోటియా వివాదాస్పద గ్రామాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు కంభం మండలంలో రూ.5 కోట్లతో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం. ప్రజల చిరకాల రహదారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక చొరవ. సేవాభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చేతుల పరిశుభ్రతపై అవగాహన కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు..! పరిసరాల పరిశుభ్రతే అందరి లక్ష్యం సింహాద్రిపురంలో బ్రహ్మోత్సవ శోభ . దసరా వేడుకలకు ఆరు ఆలయాలు ముస్తాబు సీబీఎస్‌ షాపింగ్‌ మాల్‌ లో దసరా డబుల్ ధమాకా సేల్‌ ప్రారంభం

బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

Select Suryaa Now
బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి   34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

అనంతపురం బ్యూరో : బీసీల రాజకీయ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన విమర్శలు గుప్పించారు.

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల బీసీ వర్గాలకు నష్టం జరిగిందని కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. బీసీల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసిన అంశాలపై వైసీపీ నాయకులు ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.

బీసీలకు అధికారం అంటే పదవులు మాత్రమే కాదు.. ఆత్మగౌరవం, రాజకీయ గుర్తింపు, సమాన అవకాశాలు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, పాలనలో భాగస్వాములను చేయడమే నిజమైన సామాజిక న్యాయమని అన్నారు. బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడే వైసీపీ నాయకులు, గత ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన నష్టంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు.

 బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టపరమైన నిబంధనలు, రిజర్వేషన్లకు అనుగుణంగా బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ఎదుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

బీసీ సోదరులు తమ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలవాలని, గత ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని పేర్కొన్నారు.

బీసీల అభివృద్ధి, రాజకీయ న్యాయం, ఆత్మగౌరవ పరిరక్షణే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వెల్లడించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.