BREAKING
*సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...!

సింహాద్రిపురంలో బ్రహ్మోత్సవ శోభ . దసరా వేడుకలకు ఆరు ఆలయాలు ముస్తాబు

Select Suryaa Now
సింహాద్రిపురంలో బ్రహ్మోత్సవ శోభ . దసరా వేడుకలకు ఆరు ఆలయాలు ముస్తాబు

సింహాద్రిపురం మేజర్ న్యూస్: 
మండల కేంద్రంలోని ఆలయాల్లో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీలు సిద్ధమయ్యాయి. ఆదివారం ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం మాడవీధుల్లో స్వామివారి పల్లకిసేవ నిర్వహించనున్నారు. దసరా సందర్భంగా విజయదశమి రోజున స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం గ్రామోత్సవంగా జరగనుంది. ఈ సందర్భంగా మహిళా బృందం కోలాట ప్రదర్శన, శివశంకర్ బృందం డ్రమ్స్ వాయిద్యాలతో ఉత్సవాలకు ప్రత్యేక శోభ చేకూరనుంది.
అలాగే పాతూరులోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయం, కొత్తూరు బైపాస్ రోడ్డులోని చౌడేశ్వరి దేవి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయం, ఏడుబిల్లల పెద్దమ్మ ఆలయం, మహిళా మండలి వీధిలోని పెద్దమ్మ ఆలయాల్లోనూ దసరా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గూడూరులోని అంకాలమ్మ ఆలయంలో కూడా దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా