BREAKING
అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

కంభం మండలంలో రూ.5 కోట్లతో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం. ప్రజల చిరకాల రహదారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక చొరవ.

Select Suryaa Now
కంభం మండలంలో రూ.5 కోట్లతో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం.  ప్రజల చిరకాల రహదారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక చొరవ.

 ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి విజ్ఞప్తుల మేరకు రహదారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, పల్లె పండుగ–3.0లో భాగంగా కంభం మండలంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, తారు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, భూమిపూజ నిర్వహించారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా జంగంగుంట్ల గ్రామంతో పాటు కంభం పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి అర్బన్ కాలనీ వరకు, హజరత్ గూడెం నుంచి అంకాలమ్మ గుడి వరకు అంతర్గత సీసీ రోడ్లు, కందులాపురం నుంచి రావిపాడు వరకు, హజరత్ గూడెం నుంచి రావిపాటి హైవే వరకు తారు రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యలకు పరిష్కారం.

స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి, రహదారి సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభించడంతో గ్రామస్తులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచి, ప్రజలకు రవాణా ఇబ్బందులు తగ్గించడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కంభం మండల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.