అరకు పార్లమెంట్ జనసేన నిర్వహణ దళ్ సభ్యుడిగా డొంపాక సాయికుమార్ నియామకం
పాలకొండ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ నిర్వహణ దళ్ సభ్యుడిగా పాలకొండ నియోజకవర్గానికి చెందిన డొంపాక సాయికుమార్ నియమితులయ్యారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అరకు పార్లమెంట్ సమన్వయకర్తల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డొంపాక సాయికుమార్ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. సాయికుమార్ నియామకం పట్ల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.