పులివెందుల అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యం బీటెక్ రవి
పులివెందుల మేజర్ న్యూస్:
ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ప్రజాదర్బార్ నిర్వహించారు. శనివారం పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన బీటెక్ రవి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రద్ధగా విని, సంబంధిత అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల తీవ్రతను వివరించి, వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు స్పందించాలని ఆయన కోరారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను పరిశీలించి, పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
పులివెందుల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని బీటెక్ రవి పేర్కొన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజాదర్బార్ ద్వారా ప్రజలకు, అధికారులకు మధ్య సమన్వయం పెంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశం లభించిందని ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు