17న అనంతలో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ ప్రారంభం.. మచ్చ రామలింగారెడ్డి
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జ్ఞాపకార్థం ఏపీ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్‌ను ఈ నెల 17న అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.
ఉద్యోగుల ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలు 25వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాయని, సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 30 జట్లు పాల్గొంటాయని వెల్లడించారు. ఐపీఎల్ తరహాలో రంగుల దుస్తులతో పోటీలు నిర్వహిస్తామని, పాల్గొనే ఉద్యోగులకు టీషర్టులు అందజేస్తామని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే ఈ పోటీలు సెలవు రోజుల్లో మాత్రమే జరుగుతాయని, ఈ నెల 17, 18 తేదీల్లో ఆర్డీటీ మైదానంలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.
అనంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె. విజయరాజు, సభ్యుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.