BREAKING
మణిరత్నం సినిమా కోసం పారితోషికం భారీగా తగ్గించుకున్న విజయ్ సేతుపతి.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్! స్పేస్‌ఎక్స్ స్పెక్ట్రమ్ ఒప్పంద ప్రభావం, ఏడు శాతం పడిపోయిన డ్యూయిష్ టెలికాం షేర్లు నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసులకు శిక్షణ సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం తీరొక్క పూల పరిమళాలు .. చిన్నారుల ఆటపాటలు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ చిత్రంలో క్రేజీ బ్యూటీ మమితా బైజు.. మరో సంచలన తారాగణం! ఘనాలో కొత్త మైనింగ్ బిల్లు ఉపసంహరణ, సవరించిన ముసాయిదాను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం పులి శివలింగంగా వెలసిన క్షేత్రం.. పుల్లేటికుర్రు వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయం ఆఫ్రికాలో ఈక్విటీ పెట్టుబడులను మరింత పెంచనున్న అమెరికా హోలీ క్రాస్ గర్ల్స్ హైస్కూల్ సమస్యలను పరిష్కరిస్తా - మంత్రి ఫరూక్ వై. వెంకటరామిరెడ్డిని ఆహ్వానించిన గుత్తి వైసీపీ నాయకులు లుకాయిల్ అంతర్జాతీయ ఆస్తుల కొనుగోలు రేసు నుంచి తప్పుకున్న కార్లైల్ గ్రూప్ మేడ్చల్ డిపోలో ఉత్సాహంగా ఎన్నికలు మొదటి విజయం సాధించినా పోరాటం ఆపేది లేదంటున్న ఫ్రాన్స్ విద్యార్థి ఆందోళనకారులు రైతులకు పశుగ్రాసం పెంపకానికి అవకాశం.

అద్దంకిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు.

Select Suryaa Now
అద్దంకిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు.

అద్దంకి పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయం నుండి నీటి సరఫరా జరిగే ప్రాంతాలకు నేటి నుంచి కాలేజీ గ్రౌండ్ లో గల వాటర్ ట్యాంక్ నుండి మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సౌలభ్యం కోసం ఉదయం సాయంత్రం వేళల్లో ప్రాంతాలవారీగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు గుంజి వారి పాలెం, గాంధీ బొమ్మ సెంటర్, మారం వారి వీధి, కొత్తపేట, అత్తులూరి వారి వీధి, మున్సిపల్ కార్యాలయం ప్రధాన రోడ్డు ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుండి 6 గంటల వరకు గీతా మందిరం రోడ్డు, రామా టాకీస్ బజార్, పోలీస్ స్టేషన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్క బజారు, పశు వైద్యశాల బజారు, సంజీవ నగర్ ప్రాంతాలలో నీటి సరఫరా జరుగుతుందన్నారు. నేటి సరఫరా లోని ఈ మార్పులను గమనించి తమ సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.