వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి.
సూర్య న్యూస్ అద్దంకి.
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ గోపాలపురం రైతులు ఈఈ నల్లూరి మస్తాన్‌రావును గురువారం కలిసి విన్నవించారు. భవనాశి కాల్వ నీటిని మోటార్లతో వినియోగించరాదనే సాకుతో గ్రామానికి చెందిన వ్యక్తి అభ్యంతరం మేరక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను అధికారులు తొలగించారని రైతులు తెలిపారు. తమ పొలాల్లో బోర్లు ఉన్నాయని, ఆ బోరు నీళ్లను పొలాలకు పెట్టుకోవాలంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తప్పనిసరిగా కావాలని రైతులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని ఈ ఈ మస్తాన్ రావు తెలపడంతో రైతులు వెను తిరిగి వెళ్లిపోయారు.