- గ్రామ తెలుగు యువత అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర
- 2012 నుంచే సేవా కార్యక్రమాలకు శ్రీకారం
రక్తదానం, విద్యార్థులకు సాయం.. గ్రామాభివృద్ధికి కృషి
- రిజర్వేషన్ అనుకూలిస్తే ఎన్నికల బరిలోకి
పామూరు,మేజర్ న్యూస్:
ప్రజలకు సేవ చేయాలనే తపన.. సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం.. ఈ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న కంబాలదిన్నె గ్రామానికి చెందిన ఏలూరి మాధవరావు (కోటయ్య) రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామ తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎస్‌ఎల్‌వీ వెల్ఫేర్ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్న ఆయన రాజకీయ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. 2012, 2013, 2014 సంవత్సరాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రాణాపాయంలో ఉన్నవారికి ఉపయోగపడేలా కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాసామగ్రి అందించడంతో పాటు కరోనా సమయంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కంబాలదిన్నె పంచాయతీ పరిధిలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా 20 లీటర్ల మంచినీటి క్యాన్లను ఏర్పాటు చేయించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద బస్‌స్టాప్ ఏర్పాటు, చిన్నారుల కోసం పార్కు ఏర్పాటుకు కృషి చేశారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలకు చేరువైన మాధవరావు ఇప్పుడు గ్రామ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో సర్పంచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కంబాలదిన్నె సర్పంచ్ స్థానం రిజర్వేషన్ తనకు అనుకూలిస్తే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన లక్ష్యమని ఆయన భావిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో సంపాదించుకున్న గుర్తింపును గ్రామాభివృద్ధికి వినియోగించాలనే ఆలోచనతో మాధవరావు ముందుకు సాగుతున్నారు.