రేపటినుంచి స్కూల్స్, కాలేజీలు బంద్
హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. పాఠశాలలకు రేపటి నుండి ఈ నెల 22వ తేదీ వరకు సెలవులు ఉండగా, తిరిగి 23వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అలాగే జూనియర్ కాలేజీలకు రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు సెలవులు ప్రకటించగా, 22వ తేదీ నుండి యథావిధిగా తరగతులు ప్రారంభమవుతాయి. సెలవుల కాలంలో విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.