BREAKING
విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం! +ఒకవైపు ఎల్‌నినో ప్రభావం+మరోవైపు కోరలుచాచిన కాలుష్యం+ హైదరాబాద్‌కు పెరుగుతున్న ఉక్కపోత ముప్పు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.2.51 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కష్టాన్ని గెలిచిన కన్న కల.. ఎంబీబీఎస్ సీటు సాధించిన మాధురి దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు! వైజాగ్‌లో ‘ఇట్లు అర్జున’ ఈవెంట్.. స్టేజీపై హీరోయిన్ అనస్వర రాజన్‌తో కలిసి తమన్ అదిరిపోయే డ్యాన్స్! పాఠశాల ముందే.. ప్రాణాంతకంగా మారిన గుంతలు! దళపతి విజయ్ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్.. లైకా ప్రొడక్షన్స్ భారీ ప్లాన్! తంజిద్ మెరుపులు.. తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించిన బంగ్లా ఓపెనర్లు ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్టులో తొలి రోజు నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్ చలో వరంగల్ కార్యక్రమానికి బయలుదేరిన బీఎస్పీ నేతలు నేను నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. యాక్టింగ్ జర్నీపై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు! సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా తొలి టెస్టు లైవ్ స్కోర్.. మార్నస్ లబుషేన్ పోరాటం, ఆసీస్ 34/2

మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం బధిర విద్యార్థుల ప్రతిజ్ఞ.

Select Suryaa Now
మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం బధిర విద్యార్థుల ప్రతిజ్ఞ.

అద్దంకిలోని చైతన్య బదిరుల ఆశ్రమ పాఠశాలలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం బదిర విద్యార్థినీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. బదిర విద్యార్థినీ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే దుష్పరిణామాలను పాఠశాల ప్రిన్సిపల్ సురేంద్రబాబు వివరించి చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మకుమారిస్ కు చెందిన రామలక్ష్మి మాట్లాడుతూ.. నేటి విద్యార్థిని విద్యార్థుల మీద మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరు ఈ విషయంలో నిబద్ధతగా ఉండాలని కోరారు. నాగరాజు కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరం మాదకద్రవ్యాల నిరోధానికై అంకితభావంతో కృషి చేయాలని, భారత ప్రభుత్వం కోరుకున్నట్టు 'నిషా ముక్త భారత్' గా భారతదేశం ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకురాలు పూనూరి ఆరోగ్యం, సిబ్బంది రమేష్, ధైర్యం, దాసు తదితరులు పాల్గొన్నారు.