BREAKING
కుందుర్పి లో విద్య కింద విద్యార్థులకు600 సైకిళ్ల పంపిణి. నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు దర్శి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం.. అసలేం జరిగింది? నేడు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విసృత స్థాయి సమావేశం నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. కొత్త మీట్ రికార్డు సృష్టించిన కుల్దీప్, అదరగొట్టిన అథ్లెట్లు అముదాలపల్లి పంచాయితీలో పల్లె పండుగ 3.0కు మంత్రి అనగాని శ్రీకారం వేంసూరులో భారీ పేలుడు పదార్థాలు పట్టివేత... ఉచిత పశు సంతానోత్పత్తి వైద్య శిబిరం.. మీ సేవ- ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన సేవలను వెంటనే పునరుద్దరించాలి- మంత్రి ఫరూక్ కు వినతి నిర్మాతగా నాని మరో సినిమా.. నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పేద రోగులకు అండగా వీల్‌చైర్ బ్యాంక్.. అనంతపురం సర్వజన ఆస్పత్రికి 10 వీల్‌చైర్లు అందజేసిన టీసీ వరుణ్ ఓటీటీలో మరో ప్రముఖ వేదికపైకి లోకేశ్ కనగరాజ్ 'డిసి' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? భారీ ట్రాఫిక్ ఆంక్షలతో రేపు ఢిల్లీకి పలు రైళ్లు రద్దు7

పిచ్చి మొక్కల మాటున విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌!

Select Suryaa Now
పిచ్చి మొక్కల మాటున విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌!

ఎమ్మార్వో కార్యాలయం పక్కనే నిర్లక్ష్యం.. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?

ప్రజల భద్రతను గాలికొదిలేశారా? ప్రమాదం జరిగే వరకు అధికారులు మేల్కొరా? అన్న ప్రశ్నలు శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పరిసరాల పరిస్థితిని చూస్తే తలెత్తుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి కప్పుకుపోవడంతో స్థానికులు, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం ప్రజలు, వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ పరిసరాలను శుభ్రం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ పరికరాల వద్ద పరిసరాల పరిశుభ్రత, క్రమం తప్పకుండా నిర్వహణ ఎంతో కీలకమైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిచ్చి మొక్కల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌ నిర్వహణ పనులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రమాదం జరిగాక స్పందిస్తారా?

ప్రభుత్వ కార్యాలయం పక్కనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం అధికారుల పర్యవేక్షణ తీరుకు నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిదని హితవు పలుకుతున్నారు.

సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, పరిసరాలను శుభ్రం చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

— పోతుల నర్సింహా, మేజర్‌ - న్యూస్‌, శంషాబాద్‌.