పేద రోగులకు అండగా వీల్‌చైర్ బ్యాంక్.. అనంతపురం సర్వజన ఆస్పత్రికి 10 వీల్‌చైర్లు అందజేసిన టీసీ వరుణ్
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
పేద రోగులకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ ముందుకొచ్చారు. వీల్‌చైర్ బ్యాంక్ బృహత్తర కార్యక్రమంలో భాగంగా అనంతపురం సర్వజన ఆస్పత్రికి 10 వీల్‌చైర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నాంది పలికిన అనంతపురానికి చెందిన అనిల్ కుమార్‌ను టీసీ వరుణ్ ప్రత్యేకంగా అభినందించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పేద రోగులకు సహాయ సహకారాలు అందిస్తామని, ఆస్పత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని టీసీ వరుణ్ తెలిపారు. నగరంలో పింక్ టాయిలెట్ల నిర్మాణాన్ని కూడా చేపట్టి తీరుతామని టీసీ వరుణ్ విస్పష్టం చేశారు.
ఆస్పత్రికి 10 వీల్‌చైర్లు అందించినందుకు సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి టీసీ వరుణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.