BREAKING
బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం! +ఒకవైపు ఎల్‌నినో ప్రభావం+మరోవైపు కోరలుచాచిన కాలుష్యం+ హైదరాబాద్‌కు పెరుగుతున్న ఉక్కపోత ముప్పు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.2.51 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కష్టాన్ని గెలిచిన కన్న కల.. ఎంబీబీఎస్ సీటు సాధించిన మాధురి దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు!

సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్‌ రూ.25 వేలు

Select Suryaa Now
సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్‌ రూ.25 వేలు

సూర్య-గోదావరిఖని:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ పరిధిలోని అర్హులైన హిందూ ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా ఫెస్టివల్ అడ్వాన్స్‌ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ కార్పొరేట్ పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లోని ఇండస్ట్రియల్ రిలేషన్స్ విభాగం కొద్దిసేపటి క్రితం సర్క్యులర్ జారీ చేసింది. అక్టోబర్ 20న దసరా పండుగను పురస్కరించుకుని అర్హులైన ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ 15న అడ్వాన్స్‌ మొత్తాన్ని జమ చేయనున్నారు.మైన్స్ యాక్ట్ ప్రకారం సెలవులకు అర్హులైన రెగ్యులర్ ఉద్యోగులు, సిబ్బంది, సంబంధిత బడ్లీస్, ట్రైనీలకు రూ.25,000 చొప్పున చెల్లించనున్నారు. మైన్స్ యాక్ట్ ప్రకారం సెలవులకు అర్హత పొందని ఇతర తాత్కాలిక కార్మికులు, బడ్లీస్, ట్రైనీలకు రూ.12,500 చొప్పున అందజేయనున్నారు. స్థిర స్టైపెండ్‌పై పనిచేసే అప్రెంటిస్‌లకు ఈ కేటగిరీ వర్తించదు. 
గత ఏడాది పండుగ అడ్వాన్స్‌ తీసుకుని, ఇప్పటివరకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించని ఉద్యోగులకు ఈసారి పూర్తి అడ్వాన్స్‌ అందదు. గతంలో తీసుకున్న అడ్వాన్స్‌కు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలను ప్రస్తుత అడ్వాన్స్‌ నుంచి మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్నే ఉద్యోగులకు చెల్లించనున్నారు. ఈ మేరకు బకాయిల వసూళ్లపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది చెల్లించే అడ్వాన్స్‌ను నవంబర్ 2026 నెల వేతనం నుంచి, డిసెంబర్‌లో చెల్లించే జీతంలో మొదటి వాయిదా కోతతో ప్రారంభించి 10 సమాన నెలవారీ వాయిదాల్లో రికవరీ చేయనున్నారు. పదవీ విరమణకు ఇంకా 10 నెలల కన్నా తక్కువ సేవ మిగిలి ఉన్న ఉద్యోగుల నుంచి పదవీ విరమణకు ముందే మొత్తం అడ్వాన్స్‌ను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
గతంలో పండుగ అడ్వాన్స్‌ బకాయిల వసూళ్లలో కొన్ని ఉల్లంఘనలు జరిగినట్లు సర్క్యులర్‌లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధిపతులు, గనుల అధికారులు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని యాజమాన్యం ఆదేశించింది. ఉద్యోగులకు అడ్వాన్స్‌ చెల్లించే తేదీకి ముందుగానే సంబంధిత బ్యాంకులకు సమాచారం అందించాలని సూచించింది.అలాగే, అడ్వాన్స్‌ చెల్లించే నెలలోనే పదవీ విరమణ చేసే, వైద్యపరంగా ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించబడిన లేదా తొలగించబడిన ఉద్యోగులకు అడ్వాన్స్‌ చెల్లించరాదని స్పష్టం చేసింది.