అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన........ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరామర్శించారు.
కసుకర్రు గ్రామ మాజీ సర్పంచ్ బొప్పన సుబ్బారావు సతీమణి సుశీల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం వారి స్వగృహానికి వెళ్లి సుశీల గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అనంతరం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న మక్కెన నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. వైద్య చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.