ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి కార్యకర్తలు చొరవ తీసుకోవాలి-మంత్రి ఫరూక్
సూర్య, నంద్యాల బ్యూరో:ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికి అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలని మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు మరియు ప్రజల సమస్యలపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. నంద్యాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి కీలక నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు మరియు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*