సలుగుపల్లి పాఠశాలలో ఘనంగా విద్యార్థులు బతుకమ్మ సంబురాలు
సూర్య బెజ్జూర్: కోమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలపరిధిలోని సల్గుపల్లి జడ్పీ హెచ్ ఎస్, ప్రాథమిక మండలం పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులఆధ్వర్యంలో బెజ్జూర్ మండలం సలుగుపల్లి పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోచు రవి జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలప్రధానోపాధ్యాయులు నీరజ ఎంపీపీస్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు.బతుకమ్మ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.