సింగరకొండ పాలెం లో కొండచిలువ కలకలం.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మండలం సింగరకొండ పాలెం ఎస్టీ కాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద శుక్రవారం ఉదయం కొండచిలువ (పైతాన్) ప్రత్యక్షమైంది. పాఠశాల సమీపంలో కొండచిలువను చూసి ఒక్కసారిగా పాఠశాల విద్యార్థులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని సుమారు పది అడుగుల పొడవైన కొండచిలువ ను బంధించారు. అనంతరం దానిని కూకట్లపల్లి ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.