ఒక్క సి.సి. కెమెరా వందమంది పోలీసులతో సమానం*
*
*సుద్ధపల్లిలో దాత కె.వి రెడ్డి ఆర్థిక సహకారంతో 8సిసి కెమెరాల ఏర్పాటు*
*ముఖ్య అతిధిగా హాజరై సర్పంచ్ గజ్జ స్వాతిసత్యం గౌడ్, పాలకవర్గసభ్యులు, దాత, స్థానికులతో కలిసి సిసి కెమెరాలు ప్రారంభించిన సి.ఐ వేణుగోపాల్*
ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానమని మాడ్గుల సి.ఐ వేణుగోపాల్ అన్నారు. ఆధునిక సమాజంలో దొంగతనాలు, నేరాల నియంత్రణకు పోలీసుశాఖతో పాటు సి.సి కెమెరాల భూమిక అత్యంత కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. మాడ్గుల మండలం సుద్ధపల్లి గ్రామంలో వెంచర్ నిర్వాహకులు కె.వి. రెడ్డి ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన 8 సిసి కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గజ్జ స్వాతిసత్యం గౌడ్, పంచాయతి పాలకవర్గసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాడ్గుల సి.ఐ వేణుగోపాల్ ముఖ్య అతిధిగా హాజరై సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, దాత, స్థానికులతో కలిసి సి.సి కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థుల భద్రతకు, అసాంఘీక శక్తుల కదలికలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ కు దోహదం చేసే సి.సి కెమెరాల ఏర్పాటుకు దాత కె.వి రెడ్డి తోడ్పాటునివ్వడం అభినందణీయమన్నారు. సుద్ధపల్లి గ్రామంలో మాధిరిగా ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవడానికి ప్రజాప్రతినిధులు, ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకువచ్చి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనంతరం సి.ఐ వేణుగోపాల్, ఎస్.ఐ రాఘవేందర్ గౌడ్, సిసి కెమెరాల దాత శ్రీ మహాలక్ష్మి ఇన్ఫ్తా డెవలపర్స్ అధినేత కె.వి రెడ్డిని సర్పంచ్ గజ్జ స్వాతి సత్యం గౌడ్, పాలకవర్గసభ్యులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవరకొండ శ్రీనివాస్,పంచాయతి కార్యదర్శి అశోక్, స్థానిక నాయకులు, గ్రామస్థులు, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల