గుంతకల్లప్ప స్వామి ఆలయ ప్రధాన పూజారి బసప్ప మృతికి మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి నివాళులు
అనంతపురం బ్యూరో : పట్టణంలోని గుంతకల్లప్ప స్వామి దేవాలయ ప్రధాన పూజారి బసప్ప మృతి పట్ల గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బసప్ప మరణవార్త తెలుసుకున్న ఆయన స్వగృహానికి వెళ్లి పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వై. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, గుంతకల్లప్ప స్వామివారి సేవలో బసప్ప అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మృతి బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బసప్ప ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కురువ మహాదేవ, కురువ సాంబ, కురువ బసప్ప, కురువ శంకర్, కురువ లింగన్న, కురువ వస్కేరప్ప తదితరులు పాల్గొని బసప్పకు నివాళులర్పించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.