BREAKING
రేపటినుంచి స్కూల్స్, కాలేజీలు బంద్ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి దుమ్ము ధూళితో నరకయాతన... బైక్‌ అదుపుతప్పి రాయిని ఢీకొని యువకుడి దుర్మరణం రెవెన్యూ మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన షెడ్యూల్ తెలంగాణలో 95 లక్షల ఓట్ల తేడాపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త డంపింగ్‌! నంద్యాలలో నవ నారసింహులకు పంచామృత అభిషేకం రేపటినుండి పాఠశాలలకు దసరా సెలవులు బండి సంజయ్ భవానీ దీక్ష షురూ… సలుగుపల్లి పాఠశాలలో ఘనంగా విద్యార్థులు బతుకమ్మ సంబురాలు ఒక్క సి.సి. కెమెరా వందమంది పోలీసులతో సమానం* మాట నిలబెట్టుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిచ్చి మొక్కల మాటున విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌! లంబాడి గూడలో పోలీసులు కార్దన్ సెర్చ్.,..

జాతీయ రహదారుల పనులు పూర్తి చేయాలి గుంతకల్లు హనుమాన్ సర్కిల్‌లో ఫ్లైఓవర్ నిర్మించాలి పట్టణంలో ఉదయం వేళ భారీ వాహనాలకు అనుమతించరాదు బీరప్ప సర్కిల్‌లో రోడ్డు దిగ్బంధంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్

Select Suryaa Now
జాతీయ రహదారుల పనులు పూర్తి చేయాలి  గుంతకల్లు హనుమాన్ సర్కిల్‌లో ఫ్లైఓవర్ నిర్మించాలి  పట్టణంలో ఉదయం వేళ భారీ వాహనాలకు అనుమతించరాదు  బీరప్ప సర్కిల్‌లో రోడ్డు దిగ్బంధంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్

అనంతపురం బ్యూరో : గుంతకల్లు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, అసంపూర్తిగా ఉన్న గుంతకల్లు–గుత్తి–బళ్లారి జాతీయ రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని హనుమాన్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని, ఉదయం వేళల్లో భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ డిమాండ్ల సాధన కోసం గుంతకల్లు పట్టణంలోని బీరప్ప సర్కిల్ వద్ద నిర్వహించిన రోడ్డు దిగ్బంధం కార్యక్రమంలో జగదీష్ పాల్గొని మాట్లాడారు. జాతీయ రహదారుల పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా హనుమాన్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉదయం వేళల్లో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడం ద్వారా పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని సూచించారు.

సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయడంతో పాటు, ఫ్లైఓవర్ నిర్మాణం, భారీ వాహనాల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జగదీష్ కోరారు. ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించి, పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.