BREAKING
గుంతకల్లప్ప స్వామి ఆలయ ప్రధాన పూజారి బసప్ప మృతికి మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి నివాళులు జాతీయ రహదారుల పనులు పూర్తి చేయాలి గుంతకల్లు హనుమాన్ సర్కిల్‌లో ఫ్లైఓవర్ నిర్మించాలి పట్టణంలో ఉదయం వేళ భారీ వాహనాలకు అనుమతించరాదు బీరప్ప సర్కిల్‌లో రోడ్డు దిగ్బంధంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ సింగరకొండ పాలెం లో కొండచిలువ కలకలం. గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదిలో అద్భుత ఫలితాలు: పుష్కరాల నిధులపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు! శారద విద్యానికేతన్‌లో వైభవంగా ముందస్తు దసరా వేడుకలు స్థానిక ఎన్నికల కోసం పోలింగ్ బూత్ ల పరిశీలన అనారోగ్య బాధితురాలికి రూ.75 వేల ఆర్థిక సాయం కీసరగుట్టలో మాసశివరాత్రి వేడుకలు అంకిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు సాహితీ దిగ్గజం ముదిగొండ శివప్రసాద్‌ మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం! గుడ్డు ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ :పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలి: కేంద్ర మంత్రి సోనోవాల్‌తో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి! నాగారంలో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ధ్వజం: రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారంటూ మండిపాటు!

టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు

Select Suryaa Now
టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు

సూర్య టూరిజం డెస్క్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. స్పెయిన్‌లోని సెవిల్లె నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక 'టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీలను వినియోగిస్తూ ఏపీ టూరిజం చేపట్టిన వినూత్న సంస్కరణలు, డిజిటల్ సేవలను అంతర్జాతీయ సదస్సు వేదికగా ప్రపంచ పర్యాటక నిపుణులు ప్రశంసించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పర్యాటక రంగంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. "ఇప్పటికే భారతదేశాన్ని చూసేశామని అనుకుంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు రండి.. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, చారిత్రక వారసత్వం, ఆధునికతల సమ్మేళనంతో మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తాం" అని గ్లోబల్ ట్రావెలర్లకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని 130కి పైగా ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో 'నివు ఏఐ' (NIVU AI), 'ఆస్క్ ఏఐ' (ASK AI) ఆధారిత క్యూఆర్ కోడ్ సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి వివరించారు. దీని ద్వారా ప్రపంచంలోని ఏ దేశం నుంచి వచ్చే పర్యాటకుడైనా సరే.. తమ సొంత ప్రాంతీయ/అంతర్జాతీయ భాషల్లోనే ఆయా ప్రదేశాల సమగ్ర చరిత్ర, విశేషాలను తెలుసుకునే సరికొత్త అనుభూతి లభిస్తుందన్నారు. ఏపీలో పర్యాటక పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయ ట్రావెల్-టెక్ సంస్థలు, స్టార్టప్‌లు భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు మంత్రి చేతుల మీదుగా 'టూరిజం ఇన్నోవేషన్ అవార్డులు' ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.