BREAKING
అర్హులైన ఒక్కరూ ఓటరు నమోదు కోవాలి . ఆర్డీవో వసంత బాబు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి ఎం ఎల్ సీ ఎన్నికల్లో విజయానికి పక్కా వ్యూహం భారత ఐటీ కంపెనీలపై అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టిన భారత్. ప్రొఫెసర్ బిమోల్ అకోయిజమ్‌ను విధుల నుంచి తొలగించిన జేఎన్‌యూ! 28వ డివిజన్ భానునగర్‌లో పలువురు టీడీపీలో చేరిక యూపీ నుంచి 10 మంది రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక అనంతపురంలో యూజేఏసీ, వామపక్షాల, వైస్సార్సీపీ , కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ* *ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి..* *ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి – బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి* జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే గడ్డకట్టే చలిలో బైకర్‌కు అల్పాహారం అందించిన ఆర్మీ అధికారి.. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు తయారు చేస్తూ నెలకు రూ.60,000 సంపాదన.. పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలోనికి గంగరాజుకు చోటు. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి*

నాగారంలో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన

Select Suryaa Now
నాగారంలో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన

పాఠశాల పక్కనే టవర్ వద్దంటూ నిరసన

 రేడియేషన్‌తో విద్యార్థులకు ప్రమాదమని ఆవేదన

 నాగారం బస్‌స్టాప్ వద్ద బైఠాయించిన కాలనీవాసులు

కీసర, మేజర్ న్యూస్ (అక్టోబర్ 09):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం డివిజన్‌లో సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు శుక్రవారం నాగారం బస్‌స్టాప్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బస్‌స్టాప్ సమీపంలో సెల్ టవర్ ఏర్పాటు చేయడంతో తమతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన:
   నాగారం బస్‌స్టాప్ పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉందని, ఇక్కడ టవర్ నిర్మించడం వల్ల దాని నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం పడి విద్యార్థుల ఆరోగ్య భద్రత దెబ్బతింటుందని తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం:
  సెల్ టవర్ ఏర్పాటు విషయమై ఇప్పటికే ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. స్థానిక ప్రజల అభ్యంతరాలను, చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని, టవర్‌ను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తొలగించాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో కాలనీవాసులు అక్కాల సురేశ్ కుమార్, నాగుల, అన్నంరాజు అర్జున్, సాయి, శరత్, సంపత్, వినోద్, మల్లేశ్, రాకేశ్, సాయికిరణ్, సాయిప్రసాద్, మామిళ్ల కృష్ణ, పోచయ్య, నాగేశ్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

రిపోర్టర్:గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.